వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండలి చైర్మన్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏకగ్రీవమైన నూతన ఎమ్మెల్సీలతో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రమాణం చేయించారు. 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు జరగ్గా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేశారు. విజయనగరం జిల్లా నుంచి ఇందకూరు రఘురాజు, విశాఖపట్నం నుంచి వరుదు కల్యాణి, వంశీకృష్ణయాదవ్, తూర్పుగోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు, చిత్తూరు నుంచి వైఎస్ఆర్ సీపీ కుప్పం ఇన్చార్జ్ భరత్, అనంతపురం వై.శివరామిరెడ్డి శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.













