వైసీపీకి మరో షాక్.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
వైసీపీకి మరో షాక్ తగిలింది. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ వెళ్లారు. అక్కడే ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్‌కు కండువా కప్పిన చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్లు పార్టీలో చేరారు.













