రాజ్యసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్ లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేశారు. రాజ్యసభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్‌రావులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. వారు నలుగురూ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.













