జగన్ కు పోటీగా వైయస్ వివేకానంద రెడ్డి కూతురు.. ఇది సంభవమేనా?
వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత ఇంటిలోనే వ్యతిరేకత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకపక్క ఆయన చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ తరఫున విమర్శల అస్త్రాలు సంధిస్తున్నారు. ఇంకో పక్క దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు.. జగన్మోహన్ రెడ్డి చెల్లెలైన సునీత కూడా మా అన్నకు ఓటు వేయకండి అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి తమ్ముడు అయిన వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇంకా ఈ కేసు విషయంపై పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. మరొక పక్క ఈ హత్యతో జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అన్న పుకారు కూడా ఉంది. ఇక ఆ విషయాలు పక్కన పెడితే వివేకానంద రెడ్డి స్మారక సభను కడపలో ఆయన కుమార్తె సునీత, సతీమణి సౌభాగ్యమ్మ నిర్వహించారు. ఈ సభకు వైయస్ షర్మిల కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సునీత.. ఆమె పొలిటికల్ ఎంట్రీ పై అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది అంటూ మాటను దాటివేశారు. మరోపక్క సునీత లేక సౌభాగ్యమ్మ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డి పై సౌభాగ్యమ్మ పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే కడప ఎంపీ స్థానం నుంచి లేక పులివెందల అసెంబ్లీ స్థానం నుంచి సునీతను బరిలోకి దింపాలని చూస్తున్నారు. అయితే చివరి నిర్ణయం తల్లి కూతుర్ల చేతుల్లోనే ఉంది. మరి ఈ విషయంపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.













