గతంలో ఏమని మాటిచ్చారు? ఇప్పుడేం చేశారు?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎందుకు మాట్లాడలేదని వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. విశాఖపట్నం పరిధి జ్ఞానాపురంలోని ఎర్నిమాంబ ఆలయ శిఖర ప్రతిష్ఠ కార్యక్రమంలో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరానికి వచ్చి ఈ ప్రాంతం గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడం దారుణమన్నారు. టీడీపీ ట్రాప్లో బీజేపీ పడిరది. అసలు అమిత్షా సభలో వేదికపై ఎవరున్నారో తెలుసు కదా. టీడీపీ నేతల మాటలే ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. గతంలో రాష్ట్రానికి ఏమని మాటిచ్చారు. ఇప్పుడేం చేశారు? దానికి అమిత్ షా సమాధానం చెప్పి ఉంటే చాలా సంతోషించేవాళ్లం అని అన్నారు.













