YS Sharmila: ఉద్యమం అనే పదానికి ఆ పార్టీకి అర్థం తెలుసా? : వైఎష్ షర్మిల

బీజేపీ తీసుకొచ్చే అన్ని బిల్లులకు వైసీపీ మద్దతిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy ) కి వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan ) ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant ) ఉద్యమాన్ని వైసీపీ ఖూనీ చేసింది. ఉద్యమం అనే పదానికి ఆ పార్టీకి అర్థం తెలుసా? గత ప్రభుత్వ హయాంలోనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు అడుగులు పడ్డాయి. రుషికొండ భవనాల అంశంపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేద? వివేకా(Viveka) హత్య కేసులో ఆయన కుమార్తె సునీతకు ఇప్పటికే న్యాయం జరగడం లేదు. జగన్, అవినాష్ రెడ్డి (Avinash Reddy) బీజేపీకి కొమ్ము కాస్తూ, విచారణ ముందుకు సాగనివ్వట్లేదు అని ఆరోపించారు.