ఈ విషయంలో దేశంలోనే వైఎస్ జగన్ రికార్డు
అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రంగా ఆంధప్రదేశ్ను మార్చారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఈ సంద్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అనాలోచిత పాలనలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆదాయం, అప్పుల ద్వారా వచ్చిన సోమ్ము ఏమవుతోందని ప్రశ్నించారు. జీతాలు, పెన్షన్లు సంక్షేమం కోసం కూడా అప్పులేనా? డబ్బులివ్వకపోవడంతో ప్రైవేటులో ఆరోగ్యశ్రీ నిలిచిపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఫిబ్రవరికే రూ.79,191.,58 కోట్లు అప్పులు చేసి దేశంలోనే జగన్ రికార్డు సృష్టించారని అన్నారు.
గతేడాది కంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ రూ.5 వేల కోట్లు పెరిగిందని, ల్యాండ్ రెవెన్యూ ఆదాయం గతేడాది కంటే రూ.103 కోట్లు పెరిగిందన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ గతేడాది కంటే రూ.10 వేల కోట్లు ఎక్కుమైందని, గతేడాది కంటే రూ.29,109 కోట్లు ఆదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఒక్కో వ్యక్తి నెత్తిన రూ.70 వేల అప్పు పెట్టారని, 3 నెలల్లోనే రూ.73.812 కోట్ల అప్పు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు డబ్బుమాత్రం మాయమవుతోందని విమర్శించారు. కరోనా సమయంలో వచ్చిన విరాళాలన్నీ ఎటు పోయాయన్నారు.













