దళితులను మోసం చేస్తోన్న చంద్రబాబు
చిత్తూరు జిల్లా పల్లమాలలో దళితుల .. ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు
మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశాడు. ఎవ్వరినీ వదల లేదు. ప్రతి కులాన్ని మోసం చేశాడు. ఎన్నికలపుడు చంద్రబాబు డోలు కొడతాడు. ఎన్నికలకు ముందు నేనే పెద్ద మాదిగనంటాడు. తరువాత దళితుల భూములను ఆక్రమిస్తారు. అత్తగారి సొత్తా దళితుల భూములు? ఎన్నికలకు ముందు స్రతి పేద వాడికి .. భూమి స్థలం ఇస్తానని చెప్పాడు చంద్రబాబు. రూ అయిదు కోట్ల వడ్డీ లేని రుణం అన్నాడు. లంబాడీలతో కూడా పోటో దిగుతాడు, వారినీ మోసం చేస్తాడు చంద్రబాబు.
మంత్రి ఆదినారాయణరెడ్డి అంటాడు… దళితులు స్నానం చేయరట. దళితులు చదువు కోరట. నిస్సిగ్గుగా ఇలా మంత్రి మాట్లాడుతున్నారు.
మరో మంత్రి అచ్చెన్నాయుడు ఎస్సీ ఆపీసర్.. మహిళను కాలుతో కొట్టాడు. మంత్రి కాలుతో తన్నినా చర్యలులేవు. మరో వైపు ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని ముఖ్యమంత్రి అంటారు. మరో వైపు దళితుల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఆక్రమిస్తోంది.
వైయస్ హయాంలో 32 లక్షల ఎకరాలను .. 22 లక్షల మంది దళితులకు ఇచ్చారు. చంద్రబాబు దళిత భూములను చేజిక్కించుకుంటున్నారు. కరువు పనులు నిధులను ఇతర పనులకు మళ్ళిస్తున్నారు. నీరు చెట్టుకు ఉపాధి నిధులను వెచ్చిస్తున్నారు. సిమెంటు రోడ్లకు ఉపాధి నిదులను వెచ్చిస్తున్నారు. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి లభించడం లేదు. ఏపీలో పలు చోట్ల దళితులపై దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. దళిత మహిళలకు భద్రత కరువైంది. నవ రత్నాలు దళితులకు వర ప్రసాదం దళిత చిట్టి పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. అపుడే దళిత కటుంబాల తల రాతలు మారుతాయి.
కాంట్రాక్లర్లకు రేట్లు పెంచుతాడ.. పేదలకు పెన్షన్లు మాత్రం పెంచరు. లంచాల కోసం కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతున్నాడు. దళితులంటే చంద్రబాబు చులకన. పులివెందుల నియోకవర్గంలో ని బలపనూరులో.. దళిత కుటుంబాల కరెంటు ఛార్జీలు హెచ్చుగా ఉంటున్నాయి. ఒక దళిత కుటంబ కరెంటు బిల్లు రూ 20 వేలు వచ్చింది. కరెంటు బిల్లులు చూసి దళితులు లబోదిబోమంటున్నారు. వైయస్సార్సీపీ అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలకు 200 యూనిట్ల దాకా ఎలాంటి చార్జీలుండవు. దళితులకు భూములు ఇవ్వడమే కాక. ఆ భూములలో ఫ్రీగా బోర్లు వేస్తాం.













