ప్రతిష్టాత్మక కళాశాలలో జగన్ కుమార్తెకు సీటు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి కి ప్రపంచ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో చదువుకునేందుకు సీటు లభించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో, తన ఎంబీఏని ఆమె పూర్తి చేయనున్నారు. దీని కోసం మంగళవారం నాడు హర్షారెడ్డి లండన్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సహా ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు వరకూ వెళ్లనున్నారని సమాచారం. చిన్నతనం నుంచే చదువులో మంచి ప్రతిభ కనపరుస్తున్న హర్షారెడ్డి ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక సిఎం జగన్ చిన్న కుమార్తె వర్ష యూఎస్, ఇండియానా రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ నార్టే డామ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.













