ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికే.. వైఎస్ఆర్సీపీ మద్దతు :వైఎస్ జగన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. సమావేశం అనంతరం జగన్ మాట్లాడుతూ రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు అవకాశం లభించిందన్నారు. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉందన్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనది అని అన్నారు. అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ముర్ముని రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలిపారు.













