టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
వైసీపీకి చెందిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదరంగా ఆయన్ను ఆహ్వానించారు. వైసీపీలో బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. టీడీపీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఉత్తుత్తి సామాజిక న్యాయమే జరుగుతోంది. అక్కడ బీసీలకు పదవులు ఉంటాయి కానీ అధికారాలు ఉండవు. కర్నూలు అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే టీడీపీలో చేరా. నగరం నుంచి వలసలు నివారించలేకపోయాననే బాధ ఉంది. తాగునీరు కూడా ఇవ్వలేకపోయా. సీఎం అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అని అన్నారు.













