మత్స్యకారులకు అండగా మేమున్నాము.. బొత్స ఝాన్సీ
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులు ప్రజలలో మమేకమవుతూ ప్రచారం కొనసాగిస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఆదివారం నాడు విశాఖ ఫిషింగ్ హార్బర్ ను సందర్శించారు. ఈ నేపథ్యంగా ఆమె మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యల పై త్వరలో చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారులకు అండగా నిలిచిందని.. వారికి చేయూతనివ్వడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల విజయం తర్వాత మత్స్యకారులకు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ కూడా ఇచ్చారు.. ఇక హార్బర్ లో ఝాన్సీ మత్స్యకారుల తో చాలాసేపు ముచ్చటించారు.. వారి వద్ద ఉన్న చాపల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరగబోయే ఎన్నికలలో తమ పార్టీకే మద్దతు ఇవ్వవలసిందిగా వారిని అభ్యర్థించారు.













