బిజెపి, వైసిపి, టిఆర్ ఎస్ లపై యనమల ధ్వజం
పత్రికా ప్రకటనలో 3 పార్టీల కుట్రలపై యనమల మండిపాటు
నరేంద్రమోది కాదు ‘రఫెల్ మోది’గా ప్రజల్లో ఉంది. మోది హయాంలోనే అతిపెద్ద డిఫెన్స్ స్కామ్. రక్షణ శాఖపై ఇంత అవినీతి ఆరోపణలు గతంలో లేవు. రక్షణ శాఖలో రూ.63వేల కోట్ల కుంభకోణం అతి పెద్దది. రాఫెల్ స్కామ్ మొత్తం ఇప్పటికే రెట్టింపయ్యింది. రూ.31వేల కోట్లు నుంచి రాఫెల్ స్కామ్ రూ.63వేల కోట్లకు చేరింది. దేశం మొత్తం నరేంద్రమోదిని ‘రఫెల్ మోది’ అంటోంది. గత ప్రధానుల్లో ఎవరిపైనా ఈ స్థాయి అవినీతి ఆరోపణలు లేవు.
మోది‘‘మన్ కి బాత్ కాదు, ‘‘భ్రష్టాచార్ కి బాత్ ’’ మోది మాట్లాడాలి. అవినీతిపై మోది వ్యాఖ్యలు, దయ్యాలు వేదాలు వల్లించడమే
(పార్లమెంటరీ)స్థాయీ సంఘం నివేదిక తారుమారు చేయడం మోది మరో మోసం. నివేదికలో అంశాలు లీక్ కావడం (మీడియాలో) చూశాం. ఏపి పునర్విభజన చట్టం అమలు చేయకపోవడాన్ని నివేదిక ఆక్షేపించింది. ఏపికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని స్థాయీ సంఘం ప్రశ్నించింది. ఇదంతా మీడియాలో రావడం తెలిసిందే. అలాంటిది స్థాయీ సంఘం నివేదికను చివర్లో మోది తారుమారు చేశారు. పార్లమెంటునే మోసం చేసిన ఘనత మోది ది.
గత ప్రధాని హామీలను అమలు చేయకుండా పార్లమెంటును మోసం చేశారు. రఫెల్ పై తప్పుడు నివేదిక ఇచ్చి సుప్రీంకోర్టునే మోసం చేశారు. మోసాల మోది పాలనతో వ్యవస్థలన్నీ కుప్పకూల్చారు. సిబిఐకి ఒక మోసం, ఆర్ బిఐది ఇంకో మోసం, ఈడి,ఐటి లది ఇంకో దగా. ఇంత మోసం, ద్రోహం, దగాను దేశం చూడలేదు. దీనికి తగ్గ మూల్యం మోది,అమిత్ షా చెల్లిస్తారు.
జగన్ కేసుల మాఫీయే వైసిపి అజెండా. కేసుల నుంచి తప్పించుకోవడమే జగన్ లక్ష్యం. ఎవరొస్తే వాళ్లకు జగన్ మద్దతు కేసుల మాఫీకే. మోది మళ్లీ రాడనేది జగన్ కు తెలుసు. అందుకే ఢిల్లీలో మళ్లీ జగన్ ప్లేట్ ఫిరాయింపు. ఢిల్లీలో గెలిచేవాళ్లకు జగన్ ఇప్పుడే గేలం. అవినీతి వల విసరడంలో నేర్పరి జగన్మోహన్ రెడ్డి. విష వలయాలు పన్నడంలో నిపుణుడు. తన కేసులే తప్ప దేని గురించి జగన్ ఆలోచించరు. రాష్ట్ర ప్రయోజనాలు, పేదల కష్టాలు జగన్ కు పట్టవు. తెలంగాణలో ఆంధ్రావాళ్లపై దాడులను జగన్ ప్రశ్నించడు. 26కులాలను బిసిల నుంచి తొలగిస్తే నిలదీయరు. భూములపై, వ్యాపారులపై దాడులను ప్రశ్నించరు. హైదరాబాద్ లో టిఆర్ ఎస్ దాడులను జగన్ ఖండించడు. ఆంధ్రప్రదేశ్ పై మోది దాడులను ఖండించడు. కేసుల మాఫీ కోసం మోదితో జగన్ కుమ్మక్కు. కాసుల కోసం టిఆర్ ఎస్ తో జగన్ లాలూచి. ఏపి ప్రజలందరికి మరోసారి వెల్లడైంది.
మతాలనూ మోసం చేసే దుస్థితికి జగన్ చేరారు. మతగ్రంథాలను జగన్ అవమానిస్తున్నారు. గత ఎన్నికల్లో బైబిల్ పట్టుకుని తిరిగారు. అయినా ఓట్లు రాలేదనది జగన్ అక్కసు. ఇప్పుడు స్వామీజీల కాళ్లు పట్టుకుంటున్నారు. మతం కన్నా రాజకీయ లాభాలే జగన్ కు మిన్న. ఓట్ల కోసం జగన్ దేనికైనా దిగజారతాడు. జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ కు జగన్ అప్రదిష్ట. ఇండియా టుడే గోష్టిలోనూ జగన్ దుష్ప్రచారం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడమే జగన్ లక్ష్యం. ఏపికి పెట్టుబడులు రాకుండా జగన్ కుట్రలు.
తన సొంత మీడియాతో ఇప్పటిదాకా దుష్ప్రచారం. ఇప్పుడు ఏకంగా జాతీయ మీడియా వేదికపై దుష్ప్రచారం. రాష్ట్రానికే శాపంగా వైఎస్సార్ కాంగ్రెస్ మారింది. ప్రతిపక్ష పాత్రకే మచ్చతెచ్చారు. 5కోట్ల ప్రజలే వైసిపిని చిత్తుగా ఓడిస్తారు.













