కుటుంబాన్ని ముంచినవాడు రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తాడు… యనమల వైరల్ స్టేట్మెంట్
ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రూలింగ్ పార్టీపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా.. పలు రకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. మరోపక్క జగన్ మోహన్ రెడ్డి చెల్లి వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ పై ప్రశ్నల దాడికి సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు షర్మిల పేరు చెప్పి జగన్ పై విరుచుకు పడుతున్నాయి. సొంత చెల్లెలకి సమాధానం చెప్పు అంటూ యనమల కూడా జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత చెల్లికి సమాధానం చెప్పలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఎలా సమాధానం చెబుతాడు అంటూ మాజీ మంత్రి యనమల రామకృష్ణ జగన్ పై మండిపడ్డారు. సొంత కుటుంబ సభ్యులే జగన్ ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటి వ్యక్తి ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ఎద్దేవా చేశారు. మహిళా సాధికారత కేవలం టీడీపీ తో మాత్రమే సాధ్యమని ఈ సందర్భంగా యనమల అన్నారు.













