2019లో నేనే సీఎం
వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, తాను సీఎం కావడం తథ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. దక్షిణ భారత హక్కుల కోసం జరిగే పోరాటానికి తాను నేతృత్వం వహిస్తానని కూడా తెలిపారు. తొలిసారిగా చెన్నై వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుతో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఆయన ఎప్పుడు ఎవర్ని ఎత్తుతారో, ఎవర్ని దించేస్తారో చెప్పలేం. ఎవరితో స్నేహం చేస్తారో, ఎవరితో శత్రుత్వం నెరపుతారో అర్థంకాదు. అందువల్ల ఆయన్ను విశ్వసించలేం. చంద్రబాబు రాజకీయ రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నారు అని అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఒంటిరిగానే పోటీ చేస్తామన్నారు. బీజీపీకి ఎప్పటికీ స్నేహితుడిని కాదన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎవరికీ మద్దతివ్వడం లేదన్నారు. రజనీకాంత్, కమల్హాసన్లను అవసరమైతే కలుస్తానన్నారు.













