ఏపీ విద్యార్థులకు వైట్‌హౌస్ ఆహ్వానం
ఐక్యరాజ్యసమితి (యూఎన్వో)లో జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల ప్రతినిధి బృందానికి అమెరికా అధ్యక్ష భవనం సందర్శించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ నెల 27 వరకు అమెరికాలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటివరకు వైట్‌హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతినిచ్చే ఆ దేశ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైట్‌హౌస్ లోపలి ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించడం విశేషం. యునైటెడ్ నేషన్స్‌లోని స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ సమన్వయంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ఎస్సీడీ బి. శ్రీనివాసరావు నేతృత్వంలో 10 మంది విద్యార్థుల బృందం అమెరికా వెళ్లిన విషయం తెసిందే.













