జులైకల్లా పోలవరం నీళ్లు గ్రావిటితో ఇస్తాంః ముఖ్యమంత్రి
డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం
రూ.5వేల కోట్లతో చింతలపూడి ఎత్తిపోతల పథకం తెచ్చాం
జిల్లా మొత్తం రెండవ పంటకు నీరిచ్చే బాధ్యత నాది
రెండు ప్రాజెక్టులు పూర్తిచేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి
రూ.24,500కోట్ల రుణమాఫీ చేసిన చరిత్ర టిడిపిది
రుణమాఫీ అసాధ్యం అన్నాడు జగన్మోహన్ రెడ్డి
అసాధ్యాలను సుసాధ్యం చేసిన ఘనత టిడిపిదే
వైఎస్ పాలనలో ఏపిలో రైతు ఆత్మహత్యలు,క్రాప్ హాలిడేలు
పాదయాత్రలో రైతుల కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చా
అన్నమాట నిలబెట్టుకున్నా,రైతుల ఆదాయాలు పెంచాం
ఇప్పుడు ‘అన్నదాత సుఖీభవ’ తెచ్చాం.
ఖరీఫ్ కు ముందే రైతులకు పెట్టుబడి సాయం
కౌలురైతులకు,5ఎకరాల పైబడిన రైతులకు ఇస్తున్నాం
‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు రూ.22వేల కోట్లు
ప్రతి మహిళకు 2దఫాలుగా రూ.20వేలు ఇచ్చాం
యువతకు ప్రతినెలా రూ.2వేలు భృతి ఇస్తున్నాం.
నైపుణ్యాభివృద్ది, జాబ్ మేళాలు,రుణ మేళాలు పెట్టాం
5ఏళ్లలో 11లక్షల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి
యువత,మహిళలు,రైతులంతా టిడిపికే మద్దతు
అందుకే ఫ్రస్టేషన్ తో జగన్మోహన్ రెడ్డి నిందలు
ఏపిలో 9లక్షల ఓట్లు తొలగించే కుట్రలు
బీహారీ గ్యాంగ్ తో కలిసి ఓట్లు తొలగించే కుట్రలు
తెలంగాణలో 25లక్షల ఓట్లు తొలగించిన కెసిఆర్ శిక్షణ
బిజెపి, టిఆర్ ఎస్ అండతోనే జగన్ ఫారమ్ 7 దుర్వినియోగం
ఓట్లు తొలగింపు కుట్రలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలి













