వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరికి బెయిల్
ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు అప్రూవర్ డ్రైవర్ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది నవంబరులో అతణ్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి కడప జిల్లా కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గతంలో ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన కేసులో రెండు వారాల కిందట ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, తాజాగా వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది.అతనిపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్ రావడంతో రేపు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.













