షర్మిలపై విజయ్ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
రాబోయే ఎన్నికల్లో పార్టీల మధ్య పోటీ పతాక స్థాయికి చేరుకుంటుంది. ఎవ్వరు తగ్గేదే లేదు అన్నట్టుగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ప్రచారాలలో కాస్త హద్దు దాటి పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ తరఫున ప్రచార బాధ్యతలు వహిస్తున్న షర్మిల.. ఎన్నికల ప్రచారం కంటే కూడా పర్సనల్ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు అన్న రూమర్స్ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు.. నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ ప్రారంభించినప్పుడు షర్మిల విషయంలో జగన్ ఏమీ అనలేదని.. కానీ ఆంధ్రాకి వచ్చి ఇలా కాంగ్రెస్ లో చేరడం మాత్రం ఆమె చేసిన రాజకీయ తప్పిదం అని అన్నారు. ఇది ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదని.. ఆమె వెనక ఎవరో ఉండి ఇలా చేయిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలుసు అని విజయ్ సాయి రెడ్డి అన్నారు. అంతే కాదు రాజకీయంగా షర్మిల జగన్ తో విభేదించిన మాట వాస్తవమే అని విజయ్ సాయి రెడ్డి పేర్కొన్నారు. ఈసారి కూడా గెలుపు జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది అన్న ధీమా మరొకసారి విజయసాయిరెడ్డి వ్యక్తీకరించారు.













