చంద్రబాబు రాజకీయం స్టైలే వేరు.. విజయ్ సాయి రెడ్డి..
రాబోయే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగడం ఇదే మొదటిసారి అయినప్పటికీ మాటల తూటాలు పేలుస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు .నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడ నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల యొక్క స్థితిగతులపై దృష్టి సారిస్తున్నాడు విజయసాయిరెడ్డి. రీసెంట్ గా వైసీపీని వీడి టీడీపీలో చేరిన కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాలరెడ్డి పై విజయ్ సాయి రెడ్డి ఓ ట్వీట్ చేశారు.
చంద్రబాబు కాలిక్కులేషన్స్ గురించి అందరికీ తెలుసు. సీటు కావాలి అంటే 100 కోట్లు చెల్లించాలి.. అదే అతను ఎవరినైనా గుంజుకోవాలి అంటే డబ్బు వెదజల్లి మరీ లాక్కుంటారు. చంద్రబాబు చేసే హాట్ డీల్స్ ఎలా ఉంటాయో ఆంధ్రలో పసివాడిని అడిగినా చెబుతారు.. అంటూ ఆయన పోస్టులో పేర్కొన్నారు. అంతేకాదు నెల్లూరు నుంచి అభ్యర్థి దొరకక తమ పార్టీ నుంచి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీకి నిలబెట్టారు అని కూడా విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.













