మహీధర్ రెడ్డి కి ఎమ్మెల్సీ.. విజయ్ సాయి రెడ్డి హామీ..
వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఈసారి నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో నెల్లూరు ఎన్నికల ప్రచారంలో పూర్తిగా మునిగిపోయిన ఆయన ఊరు.. ఊరు తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ్ సాయి రెడ్డి ఇక్కడ ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ కందుకూరు వాసులకు పిలిస్తే పలికే దేవుడు మహీధర్ రెడ్డి అని అన్నారు. ఆయన తనకు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పిన విజయ్ సాయి రెడ్డి.. మహీధర్ రెడ్డి తనకు గురువుతో సమానమని అన్నారు. నిజానికి కందుకూరు నుంచి మహీధర్ రెడ్డి పోటీ చేయాలని భావించినప్పటికీ.. బీసీ అభ్యర్థికి ఇక్కడ టికెట్ కేటాయించారని. అయినప్పటికీ భవిష్యత్తులో ఆయన ఆలోచన మేరకే కందుకూరి పాలన ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. మహిధర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తమ పార్టీ గౌరవిస్తుందని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి హామీ కూడా ఇచ్చారు..













