ఏపీకి ప్రథమ స్థానం అభినందనీయం : ఉపరాష్ట్రపతి
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈవోడీబీలో ఆంధప్రదేశ్‌కు దేశంలోనే ప్రథమ స్థానం దక్కడం అభినందనీయమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. నెల్లూరు జర్నలిస్టులతో వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు మరింత కృషి చేస్తామని, ఈ విషయంపై ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని కేంద్ర పథకాలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పథకాలు, సంస్థల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తి చేస్తామని తెలిపారు.
కరోనా రోగులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తామని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా కోవిడ్ పై పూర్తిగా దృష్టి సారించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. దాని కోసం రూ.15 వేల కోట్లను ప్రత్యేకంగా కేటాయించారని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో ఆగిపోయిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.













