ఏపీ విద్యాశాఖకు ఉప రాష్ట్రపతి అభినందనలు
ఆంధప్రదేశ్‌లోని జిల్లాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రముఖులు, స్థానిక జానపద కళలు, ఆచారాలు, ఆహార విశేషాలు వంటి 12 అంశాల మేళవింపుతో పిల్లలకు తేలిగ్గా అర్థమయ్యేలా బాల సాహిత్యాన్ని రూపొందించేందుకు సంకల్పించిన పాఠశాల విద్యాశాఖకు అభినందనలు తెలుపుతూ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న వారికి అభినందలని, నాటి ఘనతను నేటి తరానికి తెలియజేసే ఈ ప్రయత్నం అన్ని జిల్లాల్లోనూ వేగవంతం కావాలని ఆకాంక్షించారు. కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్న ఈ పంథాలో మిగతా రాష్ట్రాలు కూడా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.













