ప్రవాసాంధ్రుల భద్రత కోసం.. ప్రమాద బీమా

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ధ్యేయంగా ఎపీఎన్‌ఆర్‌టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ సేవలు అందిస్తుందని ప్రవాసాంధ్రుల సలహాదారు, ఏపీఎన్‌టీఆర్‌టీ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్.మేడపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉండగా అందులో 2 లక్షల మందికి ఏపీ ఎన్‌ఆర్‌టీసీ ద్వారా 28 రకాల సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. విదేశాలకు వెళ్లే ప్రవాసాంధ్రుల భద్రత కోసం చౌకగా ప్రమాద బీమా కల్పించే విధంగా బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రూ.550 ప్రీమియం చెల్లించడం ద్వారా మూడేళ్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నామని, విద్యార్థులకై తే ఏడాదికి రూ.180కే అందిస్తున్నామని తెలిపారు. విదేశాలకు వెళ్లేవారు అక్కడ ఇబ్బందులు పడకుండా ఉండటం కోసం 5 జిల్లాల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్టు సొసైటీ సీఈవో కె.దినేష్ కుమార్ తెలిపారు. విదేశాల్లో ఉన్నవారు ఏదైనా సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లు 0863-2340678, వాట్సాప్ 85000 27678 ను సంప్రదించాలన్నారు.