తిరుమలలో సామన్య భక్తులకు… వేగంగా దర్శనం : వెంకయ్య చౌదరి

తిమరుల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు శ్రీవారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. వేంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు.