ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా వేమూరి ఆనంద సూర్య
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఉద్వాసన పలికిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేసింది. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా వేమూరి ఆనంద సూర్యను నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగానూ ఆయన పనిచేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన బ్రాహ్మణుల సమస్యలపై పోరాటం చేశారు.













