చంద్రబాబు హామీతో జై పవన్ అంటున్న వర్మ..
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అని చెప్పిన నేపథ్యంలో టిడిపి తమ్ముళ్ల రచ్చ మొదలైంది. చిలికి చిలికి గాలి వాన అవుతుంది అనుకున్న విషయం కాస్త టీ కప్పులో తుఫానుగా తేలిపోయింది. రెండు రోజులపాటు నొప్పులు కురిపించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సడన్గా కూల్ గా అయిపోయాడు. చంద్రబాబును కలిసిన తర్వాత అతనిలో ఈ మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తనలో పవన్ ని చూడాలని.. 2014లో తనకు ఇచ్చినట్లుగా భారీ మెజారిటీ ఇచ్చి పవను గెలిపించాలని వర్మ అతను అనుచరులకు, అభిమానులకు సూచిస్తున్నారు. ఇదంతా కేవలం చంద్రబాబు మహిమ అనేది క్లియర్గా అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో వర్మకు బాబు ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చారని.. అందుకే వర్మ మెత్తబడ్డాడు అని టాక్ నడుస్తోంది. మొత్తానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించి తీరుతామని వర్మ శబదాలు చేస్తున్నాడు. లోకల్ లీడర్ గా మంచి స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వర్మ కూడా ఇప్పుడు జై పవన్ అంటున్నాడు.. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.













