తొలిసారి విశాఖ చేరుకున్న వందే భారత్ ఎక్స్ప్రెస్
తెలుగు రాష్ట్రాలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తొలిసారిగా విశాఖ రైల్వే స్టేషన్కు చేరుకుంది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా రైల్వే స్టేషన్కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్ కార్ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8:40 గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్ సూపరింటెండెండ్ సురేష్ తెలిపారు.













