విశాఖ సౌత్ అభ్యర్థిని ప్రకటించిన జనసేనాని..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన కూటమిలో తమకు వచ్చిన 21 అసెంబ్లీ స్థానాలు మరియు 2 ఎంపీ స్థానాలకు గాను అభ్యర్థులను వరుసగా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటికే చాలా స్థానాలలో అభ్యర్థుల అనౌన్స్మెంట్ జరిగింది. ఇక ఈరోజు తాజాగా విశాఖ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిని జనసేనాని ఖరారు చేశారు. విశాఖ సౌత్ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును అధికారికంగా జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు జనసేన 19 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు అయింది. ఇంకా రెండు స్థానాలు నుంచి అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు స్థానాలలో పోటీ ఎక్కువగా ఉండడంతో కూలంకుషంగా చర్చించి అభ్యర్థుల పేర్లు మరొక రెండు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.













