శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన టీటీడీ ఈవో, అదనపు ఈవో సీఎంకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, వేదపండితులు సీఎంకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం సీఎంకు ఈవో, అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.