సీఎం వైఎస్ జగన్ ను కలిసిన ఆద్యాత్మిక ప్రవచనకర్త చాగంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ ఆద్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే చాగంటిని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం సలహాదారుగా నియమించింది. ఇందులో భాగంగా క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించి శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించారు. శాంతా బయోటెక్నిక్స్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ కే.ఐ. వరప్రసాద్ రెడ్డి కూడా ఈ సందర్భంగా సీఎం జగన్ను కలుసుకున్నారు. అనంతరం చాగంటి వరప్రసాద్ రెడ్డి సీఎం నివాసం ఆవరణలో గోశాలను సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి ప్రశంసించారు.













