తిరుపతిలో 5 వరకు లాక్డౌన్
తిరుపతిలో కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా అధికారులు లాక్డౌన్ ప్రకటించారు. మంగళవారం నుంచి ఆగస్టు 5వ తేది వరకు.. 14 రోజులపాటు నిబంధనలు అమల్లో ఉంటాయి. ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, కమిషనరు గిరీషతో కలిసి కలెక్టర్ భరత్‌గుప్తా మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో 50 వార్డుల్లోనూ 20 కేసులు దాటాయని, కొన్నింట్లో 40 కూడా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నగరమంతా కంటైన్మెంట్ జోన్‌గా మారిందన్నారు. అన్ని వ్యాపారాలు ఉదయం 11 గంటలకే అనుమతి ఉంటుం దన్నారు. వైద్య అవసరాల కోసం ఆస్పత్రులు, మెడికల్ షాపులు, పాల కేంద్రాలు ఉంటాయ న్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు, బ్యాంకుల సహా అన్నింటినీ మూత వేయాల్సిం దేనన్నారు.













