8 నుంచి శ్రీవారి దర్శనాలు
తిరుమలలో ఈ నెల 8 నుంచి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాలను ప్రయోగాత్మకంగా పున ప్రారంభించబోతున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో అధికారులతో దర్శన విధివిధానాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆగిపోయిన శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దర్శనాల ప్రారంభానికి అంగీకారం లభించడంతో దర్శనాల అమలుపై ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. కాగా, శ్రీవారి ఆలయంలో జ్వేష్టాభిషేకాలు ప్రారంభమయ్యాయి.













