ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు
పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో టైమ్స్ ఇఫ్ ఇండియా గ్రూప్ అవార్డు రాష్ట్రానికి రావడం సంతోషమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఢీల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్కు ఆయన కలిసి ఈ అవార్డు వివరాలను తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రిని ముఖ్యమంత్రి అభినందించారు.













