ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తెలుగుదేశం పార్టీ
అభ్యర్థుల ఖరారుపై పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాలని నిర్ణయం. తొలిజాబితాలోనే 100 నుంచి 125 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు జిల్లా అభ్యర్థుల పై స్పష్టత. నెల్లూరు, కడప, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో మెజార్టీ సీట్లపై స్పష్టత. భిన్నాభిప్రాయాలు ఉన్న స్థానాలపై ఆచితూచి వ్యవహరిస్తున్న చంద్రబాబు. కొన్ని స్థానాల్లో వ్యూహాత్మక జాప్యం చేయాలని టీడీపీ నిర్ణయం. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలు వచ్చే సూచనలతో వ్యూహాత్మక జాప్యం. రైతు సంక్షేమంపై టీడీపీ నాయకత్వం మరింత కసరత్తు. అన్నదాతా సుఖీభకు మెరుగులు దిద్దుతున్న టీడీపీ అధినాయకత్వం. మేనిఫెస్టో కమిటీ, వ్యూహ కమిటీ ఏర్పాటుకు టీడీపీ నాయకత్వం నిర్ణయం. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం.













