ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా ?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును చంపేందుకు వైకాపా నేతలు ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడి చేయడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికే రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. మాజీ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్రావు రెండో వర్ధంతి సందర్భంగా సీఎం, మంత్రులుపై అయన్న విమర్శలు గుప్పించారు. దీంతో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్, పార్టీ శ్రేణులు చంద్రబాబు నివాసం ముట్టడికి యత్నించారు. దీనిపై విశాఖపట్నంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న స్పందించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం పద్దతి కాదన్నారు. దాడి ఘటనపై ప్రధాని, కేంద్ర హోంమంత్రి అమితి షా జోక్యం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని నేను తిట్టలేదు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటారు అదే రీతిలో తెలుగులో అన్నాను. నా వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కావాలనే రచ్చ చేస్తున్నారు. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రుల పనులను బట్టే సందోధించాను. నా మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు.













