విషాదంలో టీడీపీ శ్రేణులు.. సీనియర్ నేత కన్నుమూత..
ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో అనూహ్యంగా టీడీపీ లో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నూమూశారు. అనారోగ్య కారణంగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావు అక్కడే మరణించారు. పల్నాడు జిల్లాకు చెందిన బీసీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు టీడీపీ లో కీలకమైన నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. గతంలో రెండు సార్లు నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్గా వ్యవహరించిన నాగేశ్వరరావు టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులుగా కూడా ఉన్నారు. గురజాల నియోజకవర్గంలో నాగేశ్వరరావు బలమైన బీసీ నేతగా ఎదిగారు. గత కొద్దికాలం అనారోగ్యంతో ఇబ్బంది. పడుతూ ఉన్న ఆయన నరసరావుపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మరణించారు.ఆయన మృతి పల్నాడు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నాగేశ్వర్ రావు లాంటి వ్యక్తి మరణం పార్టీకి తీరని లోటు అని అందరూ భావిస్తున్నారు.













