మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు
మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కీలక వ్యాఖ్యలు చేశారు. తవణంపల్లి మండలం దిగువమాఘంలో అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ భవనానికి భూమి పూజలో గల్లా అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ భవిష్యత్తు ముగిసినట్టేనని వెల్లడించారు. తన సంకల్పమే తన భవిష్యత్తన్నారు. తాను చూడని రాజకీయం లేదని, చేయని పదవి లేదన్నారు. నా అనుచరులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. రాజకీయ వారసుడిగా తన కుమారుడు కొనసాగుతాడని తెలిపారు. ఏ పార్టీలో భవిష్యత్ ఉంటుందో వాళ్లు అక్కడ ఉండొచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ వద్దనుకున్నాను. అందుకే సైలెంట్‌గా ఉన్నానని అన్నారు.













