బద్వేల్ బరి నుంచి తప్పుకున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బద్వేల్ ఉప ఎన్నికల బరి నుంచి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వైదొలిగింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మృతితో ఖాళీ ఏర్పడటంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధకు వైసీపీ టిక్కెట్ ఇచ్చింది. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్నందునే తాము ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయిం తీసుకున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు తెలిపారు. మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు టిక్కెట్ కేటాయిస్తే అభ్యర్థిని ప్రకటించకూడదనే గత సాంప్రదాయాన్ని కొనసాగించాలని తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.













