రాజీనామా చేస్తే …ఆ పని చేసేదెవరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్‌పై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తే పార్లమెంట్లో పోరాడేది ఎవరంటూ ఆయన ప్రశ్నించారు. కేంద్రంపై అవిశ్వాస నోటీసులు ఇచ్చి వైసీపీ నాటకాలాడుతోందన్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ వైసీపీ, పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీలు ఇటీవల డిమాండ్ చేశాయి. ఈ పరిణామాలపై మురళీమోహన్ పై విధంగా వ్యాఖ్యానించారు.













