జగన్ సిద్ధం పోస్టర్లపై ఎన్నికల అధికారులకు టిడిపి నేతల కంప్లైంట్.
ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున ప్రచార నిమిత్తం ఏర్పాటుచేసిన సిద్ధం పోస్టర్లను తొలగించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాలలో ఈ పోస్టర్ల తొలగింపు జరగలేదు. తిరుపతిలోని లీలామహల్ సర్కిల్ రోడ్డు ఇరువైపులా జగన్ సిద్ధం పోస్టర్లు తొలగించలేదు అంటూ తెలుగుదేశం నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. లీలా మహల్ సర్కిల్ లోనే కాక తిరుపతిలో అక్కడక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి సిద్ధం పోస్టర్లు అలాగే ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత నిబంధనలు పాటించాలి.. కానీ కొందరు వాటిని సరిగా పట్టించుకోవడం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు మునిసిపల్ , ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫ్లెక్సీలు పెట్టడానికి జగనన్న ప్రజాధనాన్ని కోట్లకి కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడేమో చిరిగిన పోస్టర్లు చెత్తబుట్టలో దర్శనం ఇస్తున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని పోస్టర్ల కోసం ఖర్చు పెట్టకుండా ఏదైనా ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన అర్థం ఉండేది కదా అని ఆక్రోసిస్తున్నారు ప్రజలు.













