ఏపీకి త్వరలో శ్రీలంక పరిస్థితి : యనమల
ఆంధ్రద్రేశ్ రాష్ట్రానికి త్వరలో శ్రీలంక పరిస్థితి వస్తుందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిందని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి రేటు అంటే ఏంటో సీఎం జగన్కు తెలుసా? అని ప్రశ్నించారు. నిత్యావసర రేట్లు పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ధరలు తగ్గించడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని విమర్శించారు. జగన్ విధానాలతో రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైందన్నారు. అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎనిమిది లక్షల కోట్లకు అప్పులు పెరిగాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం నిలిచిపోయిందని, రాష్ట్రంలో మరింత పేదరికం పెరిగిందన్నారు. బీహార్, ఒడిస్సాల కన్నా ఏపీ వెనుకబడిరదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని వదిలించుకోవాలని చూస్తున్నారని అన్నారు.













