ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
ఎన్జీటీ ఆదేశాలను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పురుషోత్తపట్నం పోలవరంలో అంతర్భాగమని ఏపీ ప్రభుత్వం వాదనలు వినిపించింది. విశాఖ తాగునీటి అవసరాలను పురుషోత్తపట్నం తీరుస్తుందని ప్రభుత్వం వాదనలు వినిపించింది. పర్యావరణ అనుమతులు తీసుకోవాలన్న ఎన్జీటీ ఆదేశాలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అన్ని అంశాలు పరిశీలించాకే ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని జస్టిస్ నారీమన్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్జీటీ ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.













