పది పరీక్షలకు ఏపీ సై…
-కరోనా కట్టడి ఎలా? పలువురి విస్మయం…
-మరోసారి న్యాయపరమైన చిక్కులు రానున్నాయా?
చాలా విషయాల్లో దూకుడు వైఖరి అవలంభిస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలోనూ తన రూటే సపరేటు అంటోంది. కోవిడ్ శరవేగంగా వ్యాపిస్తున్న పరిస్థితుల్లో తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే 10వ తరగతి పరీక్షలను రద్దు చేసేశాయి. పరీక్షలు లేకుండానే విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామని ప్రకటించాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ తరహా నిర్ణయమే తీసుకుంటుందని పలువురు భావించారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ…













