19న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న పుష్పయాగ మహోత్సవం జరగనుంది. 18న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం జరుపుతారు. మధ్యాహ్నం ఒకటి నుంచి అయిదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీ మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.













