శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పయాగం
కలియుగ ప్రత్యక దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమం•నాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పూలు, పత్రాలతో స్వామి వారికి పుష్పార్చన చేశారు. ఇందు కోసం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి 7 టన్నుల పూలను టీటీడీ సేకరించింది. భక్తులు విరాళంగా పంపిన ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు. పుష్పయాగాన్ని పురష్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.













