వైభవంగా శ్రీవారి బ్రహ్మూెత్సవాలు ప్రారంభం
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మూెత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం ధ్వజారోహణం ఆగమోక్తంగా జరిగింది. తిరువీధుల అష్టదిక్కుల్లో బలిని వేస్తూ శ్రీమలయప్పస్వామి ఆలయ పరివార దేవతలతో కలిసి ఊరేగారు. ఆ తర్వాత ఆలయ ధ్వజస్తంభం వద్దకు స్వామివారు చేరుకున్నారు. మంగళవాద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు స్వర్ణ ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఆవిష్కరించారు. ధ్వజారోహణానికి ముందు శుభ సూచకంగా తిరుమలలో దట్టంగా వర్షం కురిసి తెరిపినిచ్చింది. రాత్రి 8 గంటలకు శ్రీవారి పెద్దశేష వాహనంపై ఊరేగారు. శుక్రవారం ఉదయం చిన్న శేషవాహనంపై, రాత్రి హంసవాహనంపై ఊరేగారు. బ్రహ్మూెత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారికి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అంతకుముదు కుటుంబసమేతంగా ఆలయ ఎదుట అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు.













