అవినాష్ వర్సెస్ షర్మిల.. హస్తం స్కెచ్ మామూలుగా లేదుగా..
జరగబోయే పార్లమెంట్ ఎన్నికల పై కాంగ్రెస్ పార్టీ పూర్తి ఫోకస్ పెడుతోంది. ఈసారి ఎలాగైనా మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని హస్తం గట్టిగానే ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను ఎంపీ అభ్యర్థిగా కడప నుంచి దింపబోతున్నట్లు సమాచారం. కడపలో వైఎస్ కుటుంబానికి మంచి ప్రాముఖ్యత ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా షర్మిలకు మంచి ఆదరింపు ఉంది. వీటిని ఉపయోగించుకొని కడప నుంచి షర్మిల కాంటెస్ట్ చేయాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. ఈనెల 25న ఏపీలో కాంగ్రెస్ తన తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో షర్మిల పేరు ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు అన్న విషయంపై పూర్తిగా క్లారిటీ లేదు. మరోపక్క వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి మరొకసారి టికెట్‌ను కేటాయించింది. అవినాష్ పై ఇప్పటికే సొంత బాబాయిని చంపిన ఆరోపణలు ఉన్నాయి. దీంతో అవినాష్ పై షర్మిల విజయం కన్ఫామ్ అంటున్నారు విశ్లేషకులు. నిజంగా షర్మిల కడప నుంచి ఎంపీగా గెలిస్తే జగన్‌కు అది పెద్ద షాక్ అవడం ఖాయం..













