ఏపీ ప్రజలకు కాంగ్రెస్ అభయహస్తం..
మరి కొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రజలకు పథకాల వరాలు కురిపిస్తున్నారు. ఓట్లు రాబట్టడం కోసం హామీలను ఎంతో ఆకర్షణీయంగా ప్రజల మధ్యకు తీసుకువస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తో పాటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రజలకు అభయ హస్తం ఇస్తోంది. వైయస్ షర్మిల నేతృత్వంలో హస్తం 9 గ్యారెంటీలను ఏపీ ప్రజలకు ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే మహి లక్ష్మీ పథకం కింద అర్హులైన ప్రతి మహిళకు నెలకు 8500 అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పెట్టుబడుల పై 50 శాతం తగ్గింపు, కూలీలకు రోజుకు 500 ఇస్తామని షర్మిల అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ విద్య అందజేస్తారట. అలాగే 2.15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారట. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని కుటుంబాలకు పక్కా ఇంటి పథకం కింద 5 లక్షల వరకు అందజేస్తారు. వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 పింఛన్ అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ షర్మిల హామీ ఇచ్చారు.













