నేటి నుంచి విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలు
విశాఖ శ్రీశారదాపీఠం వార్షికోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతీ ఏటా సాంప్రదాయబద్దంగా నిర్వహించే ఈ వార్షికోత్సవాలు ఈ ఏడాది కూడా ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు పీఠం వర్గాలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. తొలిరోజు గురువందనం, గోపూజతో ఈ ఉత్సవాలకు పీఠాధిపతి సర్వపానందేంద్ర, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు అంకుర్పారణ చేస్తారు. అనంతరం గణపతిపూజ, పుణ్యహవచనం, అగ్నిమధనం, రాజశ్యామల యాగం, నిత్యపీటపూజ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి మహా మంగళహారతి ఇవ్వనున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేయనున్నారు. ఈ ఉత్సవాలకు ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నట్లు పీఠం వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. పీఠం వార్షికోత్సవాలు సందర్భంగా అనేక ఆధ్మాతిక కార్యక్రమాలు, సాంస్కృతిక విభావరి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.













